Tuesday, May 10, 2011

నేను - నా కోపం

నాకు చాలా చాలా కోపం. మా డాడీ నుంచే వచ్చింది అనుకుంటాను! కాని నన్ను చూసిన ఎవరైనా సరే వీడికి కోపం అంటే నమ్మరు. చిన్నపట్నుంచీ అంతే. నాకు ఏదైనా నచ్చకపోతే అది బయటికి చెప్పను. మనసులో పెట్టేసుకుంటాను. నా ఛాన్స్ కోసం వెయిట్ చేసి వచ్చినప్పుడు యూస్ చేసుకుంటా ఉంటా! ఇది చాలామటుకు తప్పు అని కొందరు అంటూ ఉంటారు. ఇంకొంతమంది ఉంటారు - నన్ను ఎందుకూ పనికి రానివాడినని అనుకుంటూ ఉంటారు ఎందుకంటే నేను ప్రతీ విషయానికి (అప్పుడప్పుడూ ఇమ్పోర్తెంట్ ఐనాసరే) రియాక్ట్ అవ్వను. కాని దాని అర్థం మొత్తానికి రియాక్ట్ అవ్వనని మాత్రం కాదు. నా పాలసి ఏంటి అంటే - కోపం లో మనిషి ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది పక్కా ఫ్లాప్ అవుతుంది. అందుకని నేను ప్లాన్, ఇతరత్రా అంటుంటా. అది చాలా మందికి నచ్చదు బట్ ఐ డోంట్ మైండ్ ఎందుకంటే ఐ ఆం రాఘవ్ అండ్ ఐ నో వాట్ ఐ ఆం!


కాలేజీ లో, స్కూలు లో, ఆఫీసు లో - చాల మంది నా మీద పంచ్ లు, జోక్స్ వేసుకుంటారు. నేను ఎప్పుడూ వాళ్ళకి అడ్డు చెప్పలేదు. కాని ఒక భయంకరమైన నిజం ఏంటి అంటే - నాకు ఉన్న మొత్తం కోపాన్ని ఎవరైనా ఇగ్నైట్ చేసారు అంటే వాళ్ళ పని అవుట్. ప్లాన్ తో వాడిని ఫినిష్ చేస్తాను - మళ్ళీ రాఘవ్ అంటే జీవితంలో గుర్తు ఉండిపో ఏ లాగా!

No comments: